జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్
జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉతర్వలు జారీ చేసింది.
జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉతర్వలు జారీ చేసింది. వరసగా మూడోసారి అజిత్ దోవల్ కు ఈ బాధ్యతలను అప్పగించారు. మోదీ ప్రభుత్వ హయాంలో అజిత్ దోవల్ దేశ భద్రతపై నిరంతరం పర్యవేక్షిస్తూ సలహలు, సూచనలు చేస్తూ క్రియాశీలకంగా మారిన నేపథ్యంలో ఆయనకు మరోసారి అవకాశం కల్పించారు. ఆయన పనితీరుపై మరోసారి మోదీ నమ్మకం ఉంచి ఆయన నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ప్రధాని ముఖ్య కార్యదర్శిగా...
జాతీయ భద్రతాదారుగా వరసగా మూడోసారి నియమితులైన అజిత్ దోవల్ కారణంగానే పొరుగు దేశాలతో సంబంధాలతో పాటు ఇతర దేశాలతో విభేదాల వంటివి సులువుగా పరిష్కారమయ్యాయని మోదీ ప్రభుత్వం నమ్మి మరోసారి ఈ బాధ్యతలను ఆయనకు అప్పజెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య కార్యదర్శిగా తిరిగి పీకే మిశ్రాకు అవకాశం కల్పించింది. ప్రధాని సలహాదారులుగా అమిత్ ఖరే, తరుణ్ కపూర్ నియమితులయ్యారు.