Union Budget : గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం... రేపటి నుంచే
బియ్యం ధరలకు కేంద్ర ప్రభుత్వం కళ్లెం వేస్తూ నిర్ణయం తీసుకుంది. ధరల నియంత్రణ కోసం చర్యలు తీసుకుంది
బియ్యం ధరలకు కేంద్ర ప్రభుత్వం కళ్లెం వేస్తూ నిర్ణయం తీసుకుంది. ధరల నియంత్రణ కోసం చర్యలు తీసుకుంది. రేపటి నుంచి మార్కెట్‌లోకి బియ్యం వస్తుంది. దీనికి భారత్ రైస్ గా నామకరణం చేసింది. కిలో 29 రూపాయల చొప్పున భారత్ రైస్ ను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు నాణ‌్యత కలిగిన బియ్యం తక్కువ ధరకే మార్కెట్ లో లభించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
భారత్ రైస్...
రేపటి నుంచి మార్కెట్ లోకి వస్తున్న భారత్ రైస్ ను ఎక్కువ ధరకు విక్రయించినా, బ్లాక్ మార్కెట్ కు తరలించేందుకు ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇటీవల బియ్యం ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ ను అందుబాటులోకి తీసుకు రానుంది.