పార్లమెంటుకు చేరుకున్న నిర్మలమ్మ
కేంద్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఎన్నికలకు ముందు బడ్జెట్ కావడంతో అన్ని వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. సాధారణ ఎన్నికలకు ముందు బడ్జెట్ కావడంతో దీనిపై అన్ని వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. కరోనా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు ఊరట కలిగించేలా బడ్జెట్ ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సంక్షేమం వైపు మాత్రమే కాకుండా పలు వర్గాల ప్రజలను మెప్పించేలా ఈ బడ్జెట్ ను రూపొందించారన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
బడ్జెట్ ఆమోదం తర్వాత...
ఈరోజు ఐదోసారి బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. అనంతరం నిర్మలా సీతారామన్ పార్లమెంటు భవనానికి చేరుకున్నారు. అనంతరం జరిగే కేబినెట్ సమావేశంలో బడ్జెట్ ను ఆమోదించనున్నారు. అనంతరం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.