చంద్రయాన్-3 ల్యాండింగ్ విషయంలో కీలక మార్పు

చంద్రయాన్‌-3 ల్యాండింగ్ కు సంబంధించి కౌంట్ డౌన్ మొదలైంది. ఆగస్టు 23న

Update: 2023-08-21 02:13 GMT

చంద్రయాన్‌-3 ల్యాండింగ్ కు సంబంధించి కౌంట్ డౌన్ మొదలైంది. ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్పష్టం చేసింది. తొలుత ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు సాఫ్ట్‌ల్యాండింగ్‌ చేయాలని ఇస్రో నిర్ణయించింది. తాజాగా ఈ సమయంలో మార్పు చేశారు. 17 నిమిషాలు ఆలస్యంగా సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ను చంద్రుడిపై దించాలని నిర్ణయించారు. రష్యా ప్రయోగించిన లూనా-25 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో చంద్రయాన్‌-3 ల్యాండింగ్ విషయంలో ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.

జాబిల్లిపై ల్యాండర్‌ కాలు మోపే అద్భుత దృశ్యాన్ని అందరూ చూసేలా లైవ్‌ స్ట్రీమింగ్‌ నిర్వహించాలని ఇస్రో భావిస్తోంది. సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు సంబంధించి సాయంత్రం 5.27 గంటల నుంచి లైవ్‌ను ప్రారంభించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. ఇస్రో వెబ్‌సైట్‌, య్యూట్యూబ్‌ చానల్‌, ఫేస్‌బుక్‌ పేజీ, డీడీ నేషనల్‌ చానల్‌లో ఈ దృశ్యాలను వీక్షించవచ్చని.. విద్యా సంస్థల్లో కూడా లైవ్‌స్ట్రీమింగ్‌ నిర్వహించాలని ఇస్రో భావిస్తోంది. 

Tags:    

Similar News