నయనతార సరోగసి వివాదంపై కమిటీ రిపోర్ట్ ఏంటంటే?
నయనతార - విష్నేష్ సరోగసిపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించింది. సరోగసి చట్టబద్ధంగానే జరిగిందని పేర్కొంది
నయనతార - విష్నేష్ సరోగసిపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించింది. సరోగసి చట్టబద్ధంగానే జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. చెన్నైలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో సరోగసి జరిగింది. అంతా చట్ట బద్ధంగానే తాము గుర్తించామని కమిటీ తన నివేదికలో పేర్కొంది.
ప్రభుత్వానికి నివేదిక...
2021 ఆగస్టు లో సరోగసి ప్రక్రియ మొదలయిందని కమిటీ నివేదికలో పేర్కొంది. 2016 మార్చి 11న పెళ్లి జరిగినట్లు అఫడవిట్ లో వారు పేర్కొన్నారు. 2021 నవంబరు నెలలో సరోగసికి సంబంధించి అగ్రిమెంటు కుదుర్చుకున్నారని కమిటీ ప్రభుత్వానికి ఇచ్చని నివేదికలో తెలిపింది.