గుండెపోటుతో కాంగ్రెస్ అభ్యర్థి మృతి.. ఎన్ని ఓట్లతో ఓడిపోయాడంటే

గుండెపోటుతో కాంగ్రెస్ అభ్యర్థి మృతి.. ఎన్ని ఓట్లతో ఓడిపోయాడంటే

Update: 2022-07-17 13:01 GMT

మధ్యప్రదేశ్‌లోని రేవాలో మునిసిపల్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ నాయకుడు హరినారాయణ్ గుప్తా.. తాను ఎన్నికల్లో ఓడిపోయాననే వార్త తెలియగానే మరణించారు. రేవాలోని హనుమాన ప్రాంతంలోని మునిసిపల్ కౌన్సిల్ వార్డు నెం.9కి కాంగ్రెస్ టిక్కెట్‌పై హరినారాయణ గుప్తా పోటీలో ఉన్నారు. అయితే స్వతంత్ర అభ్యర్థి అఖిలేష్ గుప్తా 14 ఓట్ల తేడాతో ఆయనపై విజయం సాధించారు. ఎన్నికల్లో ఓటమి వార్త విన్న హరినారాయణ గుండెపోటుకు గురై మరణించారు. హరినారాయణ గుప్తా హనుమానలోని కాంగ్రెస్ యూనిట్ మండల అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.

హనుమాన మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడైన హరినారాయణ్ గుప్తా, మునిసిపల్ కౌన్సిల్ వార్డు నెం.9లో పార్టీ టికెట్‌పై పోటీ చేశాడు. ఆదివారం ఫలితాలు వెలువడగా స్వతంత్ర అభ్యర్థి అఖిలేష్ గుప్తా 14 ఓట్ల తేడాతో ఆయనపై విజయం సాధించాడు. దీంతో తన ఓటమి వార్తను విన్న హరినారాయణ్ గుప్తా వెంటనే గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని 413 మున్సిపాలిటీలు, 16 కార్పొరేషన్లు, 99 నగర పాలిక పరిషత్‌లు, 298 నగర్‌ పరిషత్‌లకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. జూలై 6, 13 తేదీల్లో రెండు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఆదివారం ఫలితాలు వెల్లడించారు.


Tags:    

Similar News