రేపు కోర్టుకు రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనపై సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయనున్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనపై సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయనున్నారు. రేపు ఆయన సూరత్ సెషన్స్ కోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నారని తెలిసిందే. తన న్యాయనిపుణులతో చర్చించిన రాహుల్ గాంధీ రేపు తనకు విధించిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేస్తూ కర్ణాటకలో 2019లో చేసిన వ్యాఖ్యలపై సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.
అప్పీల్‌కు వెళ్లాలని...
ఈ శిక్ష విధించిన 24 గంటలలోనే రాహుల్ పార్లమెంటు సభ్యత్వంపై లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. దీంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. కర్ణాటక ఎన్నికల కోసమే రాహుల్ గాంధీ ఈ నాటకాలు మొదలుపెట్టారని బీజేపీ అంటుండగా, రాహుల్‌ను సమర్థిస్తూ విపక్షాలు అధికార పక్షం నియంతలా వ్యవహరిస్తుందని ఆరోపించాయి. ఈ నేపథ్యంలో రేపు సెషన్స్ కోర్టులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాహుల్ కోరనున్నారు.