Congress : దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు.. కారణం ఏంటంటే?

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలకు దిగింది. రాహుల్‌ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై నిరసనలకు దిగింది.

Update: 2024-09-18 08:36 GMT

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలకు దిగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగింది. రాహుల్‌ను ఉగ్రవాదిగా నిందిస్తూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అజయ్ మాకెన్ ఈ ఫిర్యాదును చేశారు. బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు.

ఏపీ, తెలంగాణలోనూ...
ఢిల్లీలో యూత్‌ కాంగ్రెస్ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు. బీజేపీ నేతల దిష్టిబొమ్మకు కాంగ్రెస్‌ కార్యకర్తలు నిప్పుపెట్టారు. బారికేడ్లతో కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి.హైదరాబాద్ లోని గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనానికి కాంగ్రెస్ కార్యకర్తల ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిరసనలను చేపట్టింది.


Tags:    

Similar News