కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. 24 ఏళ్లలో గాంధీయేతర అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ లో ఈరోజు సందడి నెలకొంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీలో ఊపు తెప్పించడానికి ఈ ఎన్నికలు అని చెబుతున్నారు. 137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో 1998 నుంచి సోనియాగాంధీ ఈ అత్యున్నత పదవికి బాధ్యతలు వహించగా.. ఆ తర్వాత రాహుల్ ఆ పదవి నుండి తప్పించుకోగా అతని తల్లి తిరిగి పార్టీ తాత్కాలిక చీఫ్‌గా పనిచేస్తున్నారు. 24 ఏళ్ల తర్వాత అధ్యక్షుడి ఎంపిక కోసం సోమవారం పోలింగ్ జరుగనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఓటింగ్ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా మొత్తం 9,100కు పైగా పార్టీ సభ్యులు పోలింగ్‌లో పాల్గొననున్నారు. రహస్య బ్యాలెట్ విధానంలో జరుగనున్న ఈ ఎన్నిక ఫలితాన్ని ఈ నెల 19న వెల్లడించనున్నారు. ప్రతి రాష్ట్రంలోని పిసిసి ప్రధాన కార్యాలయంలో పోలింగ్ జరుగుతుంది. ఒకే బదిలీ ఓటు కింద ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని అధ్యక్షుడిగా ప్రకటిస్తారు.