Cyclone Midhili: తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం.. దీని పేరు ఏంటంటే..

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. ఈ తుఫానుకు

Update: 2023-11-17 13:55 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. ఈ తుఫానుకు 'మిధిలి' గా నామకరణం చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిధిలి కేంద్రీకృతమై ఉంది. తుఫాను ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తుంది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో తుఫాను గమనం ఉంది.

తీరం వైవు తుఫాను..

బంగాళాఖాతంలో తుఫాను మిధిలి.. తీరం వైపు వెళ్తోంది. ఒడిస్సా పారాదీప్ కు దక్షిణంగా 190 కిలోమీటర్లు, వెస్ట్ బెంగాల్ దిగాకు నైరుతి దిశగా 200, బంగ్లాదేశ్ ఖేపు పారాకు నైరుతి దిశగా 220 కిలోమీటర్ల దూరంలో మిధిలి ఉందని భారతవాతావరణ శాఖ తెలిపింది. 18వ తేదీ నాటికి బంగ్లాదేశ్ ఖేపు పార - మోంగ్ల మధ్య తీరం దాటుతుందని ఐఎండి ప్రకటించింది. తుపాను ప్రభావంతో వెస్ట్ బెంగాల్ ఈశాన్య రాష్ట్రాలకు వర్ష సూచన ఇచ్చింది. ఆయా తీరాల్లో బలమైన ఈదురుగాలులు విస్తున్నాయి. మరోవైవు శ్రీలంక ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం, తుఫానుకు అనుబంధంగా అల్పపీడన ద్రోని కొనసాగుతోంది. ఏపీలో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఐఎండి సూచించింది.

ఈ తుఫాను ప్రభావం ఏపీపై ఉండదని వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి విభాగం పేర్కొంది.ఈ తుపాను కారణంగా మత్స్యకారులకు రెడ్ వార్నింగ్ జారీ చేసింది వాతావరణ శాఖ. శనివారం తెల్లవారుజాము వరకు సముద్రంలోకి వెళ్లవద్దని వారికి సూచించింది. మిధిలీ తుఫాను త్వరితగతిన బంగ్లాదేశ్ తీరాన్ని తాకిన రెండవ తుపాను. గత నెలలో హమూన్ తుపాను బంగ్లాదేశ్‌లో తీరాన్ని తాకింది.

గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. క్రమంగా ఉత్తర వాయువ్యంగా కదులుతూ శనివారం ఉదయం వరకు బంగ్లాదేశ్‌లోని ఖెపుపారా వద్ద తుపాను తీరం దాటనుందని స్పష్టం చేసింది. తీరం దాటే సమయంలో బంగ్లాదేశ్‌లోని తీర ప్రాంతాల్లో గంటకు 80 కిలోమీటర్ల అతివేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

Tags:    

Similar News