నేడు వాయనాడ్ కు రాహుల్, ప్రియాంక
కేరళలోని వాయనాడ్ లో కొండచరియలు కూలి ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 143కు చేరుకుంది.
కేరళలోని వాయనాడ్ లో కొండచరియలు కూలి ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 143కు చేరుకుంది. ఈ విషయాన్ని మంత్రి వీణాజార్జి వెల్లడించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే బాధితులను రక్షించేందుకు ఆర్మీ అప్పటిపకప్పుడు తాత్కాలిక బ్రిడ్జిని నిర్మించింది.
143 మంది మృతదేహాలను...
బాధితుల వద్దకు వెళ్లేందుకు వంతెన కూలిపోవడంతో తాత్కాలిక వంతెన నిర్మించి దానిపై నుంచి వెళ్లి బాధితులను రక్షించినట్లు సహాయక బృందాలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకూ ఆర్మీ ఆర్మీ వెయ్యి మంది వరకూ రక్షించగలిగింది. ఇంకా శిధిలాల కింద ఎంత మంది ఉన్నారన్నది మాత్రం తెలియకుండా ఉంది. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వారికి అండగా నిలుస్తామని భరోసా ఇవ్వనున్నారు.