టోల్ ఛార్జీలు పెరిగాయ్
జాతీయ రహదారిపై టోల్‌గేట్ల ఛార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం అర్థరాత్రి నుంచి అమలులోకి వచ్చింది
జాతీయ రహదారిపై టోల్‌గేట్ల ఛార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం అర్థరాత్రి నుంచి అమలులోకి వచ్చింది. వాహనం స్థాయిని బట్టి ధరలను పెంచారు. నేషనల్ హైవే అధారిటీస్ ప్రతి ఏడాది సమీక్షించి టోల్ ఛార్జీలపై నిర్ణయం తీసుకుంటుంది. అందులో భాగంగా ఈసారి కూడా ఛార్జీలను పెంచారు. వాహనం స్థాయిని బట్టి ఐదు రూపాయల నుంచి నలభై తొమ్మిది రూపాయల వరకూ పెంచడం జరిగిందని అధికారులు చెబుతున్నారు.
పెరిగిన ఛార్జీలు...
ఈ పెంచిన ఛార్జీలు ఏడాది పాటు అమలులో ఉంటాయి. తర్వాత మళ్లీ నేషనల్ హైవే అధారిటీస్ సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది. ఏడు శాతం నుంచి పది శాతం ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంటారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల కోట్ల రూపాయలకు పైగానే ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న టోల్‌గేట్ల నుంచి ప్రస్తుతం ఫాస్టాగ్ ద్వారా పన్నులు వసూలు చేస్తుండటం విశేషం.