నేడు తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు

Update: 2024-06-21 02:04 GMT

arvind kejriwal 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. నిన్న కేజ్రీవాల్ కు బెయిల్ లభించడంతో ఈరోజు విడుదల కానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో పాటు మనీ లాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేయడంతో ఆయన కొద్ది రోజులుగా తీహార్ జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే. మధ్యలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు.

లిక్కర్ కుంభకోణం కేసులో...
ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే అరవింద్ కేజ్రీవాల్ తిరిగి జులై 2వ తేదీన తీహార్ జైలుకు వెళ్లిపోయారు. అయితే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది. లక్ష రూపాయల పూచీకత్తుపై ప్రత్యేక న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ఉత్తర్వులపై నలభై ఎనిమిది గంటల పాటు స్టే ఇవ్వాలని ఈడీ తరుపున న్యాయవాది కోరినా అందుకు న్యాయమూర్తి సమ్మతింలచలేదు. మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ చేశారు. దీంతో లిక్కర్ కేసులో బెయిల్ పొందిన తొలి వ్యక్తిగా కేజ్రీవాల్ నిలిచారు. ఇప్పటి వరకూ ఈ కేసులో ఎవరికీ బెయిల్ లభించలేదు.


Tags:    

Similar News