సుప్రీంకోర్టులో సిసోడియాకు నిరాశ

ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Update: 2023-02-28 12:01 GMT

ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ అరెస్ట్ విష‍ంలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. సిసోడియాకు న్యాయపరంగా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని చెప్పింది. ఢిల్లీ లిక్కర్ స్కాం లో తనను సీబీఐ అరెస్ట్ చేయడంపై సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో అత్యవసర విచారణను చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం విచారణ జరిపింది.

తాము జోక్యం చేసుకోలేమని...
సీబీఐ అరెస్ట్ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. దీనిపై హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఈ కేసులో అరెస్టయిన మనీష్ సిసోడియాను ఐదు రోజుల పాటు సీీబీఐ విచారణకు అనుమతిస్తూ సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టు చెప్పిన సంగతి తెలిసిందే. మార్చి నాలుగో తేదీ వరకూ సిసోడియాను సీబీఐ అధికారులు తమ కస్టడీలో ఉంచుకుని విచారించనున్నారు.


Tags:    

Similar News