షాకింగ్.. బంగారం ధర ఇంతగానా?

బంగారానికి డిమాండ్ అంతా ఇంతా కాదు. భారత్ లో బంగారం అంటేనే అంత మక్కువ. ముఖ్యంగా మహిళలు అత్యంత ఇష్పపడేది బంగారం

Update: 2022-11-06 02:40 GMT

బంగారానికి డిమాండ్ అంతా ఇంతా కాదు. భారత్ లో బంగారం అంటేనే అంత మక్కువ. ముఖ్యంగా మహిళలు అత్యంత ఇష్పపడే బంగారం ధరలు ఎప్పుడు పెరిగినా పెద్దగా ఆలోచించరు. తమ వద్ద బంగారం ఉండాలనుకునేవారు అనేక మంది. కొందరు సౌందర్యం కోసం. మరికొందరు తమ కుటుంబం గౌరవం పెంచుకోవడం కోసం. ఇంకొందరు పెట్టుబడి కోసం కొనుగోలు చేస్తుండటం పరిపాటిగా మారింది. అందుకే బంగారం దుకాణాలన్నీ ఎలాంటి విశేషం లేకున్నా కస్టమర్లతో కిటకిటలాడిపోతుంటాయి. గతంలో కేవలం పండగలు, పెళ్లిళ్ల సీజన్ లోనే బంగారం కొనుగోలు చేసే వారు. కానీ ఇప్పుడు అదేం లేదు. సమయం లేదు. ముహూర్తం లేదు. ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడే. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. రానున్నది బంగారం సీజన్ కావడంతో బంగారం ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.900 లు పెరిగింది. వెండి కిలో ధరపై రూ.1900లు పెరిగింది. బంగారం, వెండి ధరలు పెరగడంతో పసిడిప్రియులకు షాకింగ్ వార్తగానే చెప్పాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,000 రూపాయలు పలుకుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,280 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి పై రూ.1900 లు పెరిగింది. దీంతో కిలో వెండి ధర 66,300 రూపాయలకు చేరుకుంది.
Tags:    

Similar News