మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నివిస్ ఎన్నికయ్యే అవకాశాలున్నాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నివిస్ ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. కొద్దిసేపటి క్రితం ముంబయిలో ప్రారంభమైన బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో దేవేంద్ర ఫడ్నవిస్ ను తమ పార్టీ నేతగా ఎన్నుకోనున్నారు. మరికొద్ది సేపట్లోనే దీనిని అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ కోర్ కమిటీ సమావేశం తీసుకుంది. అయితే శాసనసభ పక్ష సమావేశానికి పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీలు హాజరయ్యారు.
శాసనసభ పక్ష సమావేశంలో...
ఎమ్మెల్యేలు అందరూ కలసి దేవేంద్ర ఫడ్నవిస్ పేరును ముక్తకంఠంతో చెప్పేలా ముందే ప్లాన్ చేశారు. దీంతో పాటు మంత్రి పదవుల పంపకం కూడా పూర్తయినట్లు తెలిసింది. బీజేపీకి 22, ఏక్ నాధ్ షిండే వర్గానికి 12, అజిత్ పవార్ వర్గానికి పది మంత్రిపదవులు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. రేపు ముంబయిలోని ఆజాద్ మైదానంలో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి.