ఆశ్చర్యం...వృద్ధుడి పొట్టలో గ్లాసు
వృద్ధుడి పొట్టలో ఉన్న గ్లాసును చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. మధ్యప్రదేశ్ లోని రాజ్ఘర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది
వృద్ధుడి పొట్టలో ఉన్న గ్లాసును చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. మధ్యప్రదేశ్ లోని రాజ్ఘర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నాలుగు నెలల క్రితం రాందాస్ అమావత్ గ్రామానికి వెళ్లాడు. కారణాలేంటో తెలియదు కాని గ్రామస్థులు అతడిని కొట్టారు. గ్లాసుపై కూర్చోబెట్టి చిత్రహింసలకు గురి చేశాడు. దీంతో ఆ గ్లాసు పొట్లోకి వెళ్లిపోయింది. గ్లాసు పొట్టలోకి వెళ్లిన విషయం బయటకు చెప్పలేక రాందాస్ కొన్ని నెలల పాటు మౌనంగా ఉన్నాడు.
ఎక్స్రే తీయగా...
అయితే ఆయనకు కడుపునొప్పి తీవ్రంగా రావడంతో తమ సొంత గ్రామమైన చతుఖేడ్ కు వచ్చి బంధువులకు చెప్పాడు. దీంతో రాందాస్ ను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఎక్స్రే తీయగా రాందాస్ కడుపులో గ్లాస్ ఉండటాన్ని వైద్యులు గమనించారు. అప్పుడు అమావత్ గ్రామ ప్రజలు తనపై దాడి చేసిన విషయాన్ని రాందాస్ చెప్పాడు. ఆపరేషన్ చేసి గ్లాసును తీస్తామని వైద్యులు చెబుతున్నారు.