ఎల్లుండి హేమంత్ సోరెన్ సీఎంగా ప్రమాణం
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్నారు
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు జేఎంఎంపార్టీ అధికారిక ప్రకటన వెలువరించింది. ఈరోజు హేమంత్ సోరెన్ ను జార్ఖండ్ గవర్నర్ ను కలసి తమకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సహకరించాలని కోరనున్నారు. హేమంత్ సోరెన్ తో పాటు కొందరు నేతలు మంత్రులుగా ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మంత్రివర్గంతో...
ఇటీవల జరిగిన ఎన్నికల్లో జార్ఖండ్ లో ఇండి కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా మరోసారి హేమంత్ సోరెన్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు ముఖ్యనేతలందరూ హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.