Paralament Sessions : నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు నుంచి డిసెంబరు 20వ తేదీ వరకూ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో పదహారు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మొత్తం 19 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.
పదహారు బిల్లులు...
అయితే ప్రభుత్వం పార్లమెంటు సమావేశాల్లో పెట్టే పదహారు అంశాలను నిన్న జరిగిన అఖిల పక్ష సమావేశంలోనూ ప్రస్తావించి వారి మద్దతు పొందేందుకు అధికార పార్టీ ప్రయత్నించింది. అయితే ఇండి కూటమి ప్రజా సమస్యలపై పట్టుబట్టాలని డిమాండ్ చేస్తుంది. ప్రజా సమస్యల ను ప్రస్తావించకుండా అధికార పార్టీ తమకు అనుకూలమైన అంశాలను మాత్రమే సభ ముందుకు తీసుకు వస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.