Maharashtra Elections : నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి తేలే అవకాశం?

మహారాష్ట్రకు నేడు నూతన ముఖ్యమంత్రి ఎవరో తేలనుంది.

Update: 2024-11-25 02:01 GMT

మహారాష్ట్రకు నేడు నూతన ముఖ్యమంత్రి ఎవరో తేలనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి నేడు ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించే అవకాశముంది. ఈరోజు, రేపట్లో ముఖ్యమంత్రిగాప ప్రమాణస్వీకారం చేసి అధికారాన్ని చేపట్టాల్సి ఉంది. 72 గంటలు మాత్రమే గడువు ఉండటంతో ఈరోజు ముఖ్యమంత్రి అభ్యర్థిని డిసైడ్ చేసే అవకాశాలున్నాయి. మహాయుతి కూటమిలో అత్యధికంగా బీజేపీకే స్థానాలు రావడంతో తమకు సీఎం పదవి కావాలని ఆ పార్టీ నేతలు బలంగా కోరుకుంటున్నారు.

ముగ్గురూ కావాలని అంటుండగా...
అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి ఏక్ నాధ్ షిండే కూడా తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని అడుగుతున్నారు. మధ్యలో అజిత్ పవార్ కూడా తనకు ముఖ్యమంత్రి పదవి అవకాశం ఇవ్వాలంటూ కోరుతున్నారు. శాసనసభ గడువు రేపటితో ముగియనుంది. అందుకే రేపటిలోగా ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉండటంతో ఈరోజు, రేపట్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంది. మూడు పార్టీలూ పట్టుపడుతుండటంతో ఎవరు ముఖ్యమంత్రి అనేది ఉత్కంఠగా మారింది.


Tags:    

Similar News