పశ్చిమ బెంగాల్ బంద్ హింసాత్మకం

పశ్చిమ బెంగాల్ లో బంద్ సందర్భంగా కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి

Update: 2024-08-28 07:49 GMT

పశ్చిమ బెంగాల్ లో బంద్ సందర్భంగా కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. విద్యార్థులపై పోలీసులు అమానుష చర్యకు నిరసనగా బీజేపీ పన్నెండు గంటల పాటు పశ్చిమ బెంగాల్ బంద్ కు పిలుపు నివ్వడంతో దుకాణాలన్నీ మూసివేశారు. విద్యార్థులపై లాఠీఛార్జి చేయడానికి నిరసనగా ఈ బంద్ ను నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల బీజేపీ నేతలపై బాంబు దాడులు జరిగినట్లు సమాచారం అందుతుంది.

బాంబు దాడులతో...
తృణమూల్ కాంగ్రెస్ నేతలే ఈ బాంబు దాడులకు కారణమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అనేక చోట్ల రైళ్ల రాకపోకలను నిలిచిపోయాయి. బస్సులు ఎక్కడికక్కడే డిపోల నుంచి బయటకు రాలేదు. రవాణా వ్యవస్థ స్థంభించడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విమానాశ్రయాలకు చేరుకోవడానికి ప్రయాణికులు సమయం చాలా కష్టంగా మారింది. బంద్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటుననారు.


Tags:    

Similar News