ఢిల్లీ, ఉత్తరాఖండ్ లలో భారీ భూకంపం
కొద్దిసెకన్ల పాటు భూమి కంపించగా.. ప్రజలు భయంతో ఇళ్లనుండి బయటికి పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్
దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు.. ఉత్తరాఖండ్ రాష్ట్రం సహా.. పొరుగు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. కొద్దిసెకన్ల పాటు భూమి కంపించగా.. ప్రజలు భయంతో ఇళ్లనుండి బయటికి పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది. కాగా.. భూకంప కేంద్రాన్ని నేపాల్ లో గుర్తించారు.
నేపాల్ లో వచ్చిన భూకంపం.. ఉత్తరాఖండ్, ఢిల్లీ పరిసర ప్రాంతాలపైనా ప్రభావం చూపింది. భూకంపం కారణంగా రోడ్లపై వాహనదాలు వాహనాలను నిలిపివేశారు. కొందరు భూకంపం సంభవించినప్పడు వీడియోలు తీసి వాటిని నెట్టింట్లో పోస్ట్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి.