సీఎం ఇంటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు వెళ్లారు

Update: 2024-01-20 11:31 GMT

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు వెళ్లారు. ముఖ్యమంత్రి సోరెన్ ను భూ కుంభకోణంలో ప్రశ్నించేందుకు వెళ్లారు. హేమంత్ సోరెన్ పై మనీలాండరింగ్ కేసు నమోదయిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేపట్టింది. అయితే ముఖ్యమంత్రిని ప్రశ్నించేందుకు ఈ రోజు ఆయన ఇంటికి వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మనీలాండరింగ్ విషయంపై ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.

భూ కుంభకోణంపై...
అయితే ఆయన ఇంటికి వెళ్లేటప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ లో ఈడీ అధికారులపై దాడులు జరిగిన నేపథ్యంలో వారికి భద్రతను భారీగా కల్పించారు. కేంద్ర భద్రతాదళాల మధ్య ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంటికి వెళ్లారు. ఇందుకోసం బాడీ కెమెరాలను కూడా ఉపయోగించారని తెలిసింది. తమపై దాడులకు దిగినా వెంటనే వారిపై చర్యలు తీసుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.


Tags:    

Similar News