Gold Prices : ఊరిస్తుందని సంబరపడకండి... ముందున్నాయ్.. అసలు రోజులు
ఈరోజు కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి
బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. తగ్గడం అంటూ జరిగే పనికాదు. తగ్గినా స్వల్పంగానే ధరలు తగ్గుతాయి తప్పించి భారీగా తగ్గేందుకు అవకాశమే లేదు. ఇక స్థిరంగా కొనసాగడమంటేనే కొనుగోలుదారులకు ఎంతో ఊరట. నిలకడగా బంగారం ధరలు ఉంటే అదే పదివేలు అన్న రీతిలో కొనుగోలుదారుల మైండ్ సెట్ తయారయింది. అంతేతప్ప తగ్గుతాయని ఎవరూ భావించరు. అనుకోను కూడా అనుకోరు. అందుకే అవసరమున్నప్పుడే బంగారాన్ని కొనుగోలు చేయడానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో...
ప్రధానంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు మరింత ప్రియం అవుతాయని అందరికీ విదితమే. అయినా సరే తప్పదు. కొనుగోలు చేయాల్సిందే. శుభకార్యాలకు పసిడిని వినియోగించడం సంప్రదాయంగా వస్తుండటంతో దానిని అప్పు చేసైనా కొనుగోలు చేయక తప్పని పరిస్థితి. అలాంటి బలహీనతనే వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. పేరుకు ధరలు పెరగడం మన చేతిలో లేదని పైకి చెబుతున్నా.. కొనుగోళ్లు తగ్గినప్పుడు బంగారానికి కృత్రిమ కొరత సృష్టించి మరీ వ్యాపారులు ధరలను పెంచుకుంటూ వెళతారు.
వెండి మాత్రం...
ఈరోజు కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు నిలకడగా కొనసాగుతుండటం ఒకరకంగా చాలా గ్యాప్ తర్వాత అని చెప్పాలి. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,200 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,490 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధరపై రెండు వందలు రూపాయలు పెరిగి ప్రస్తుతం మార్కెట్ లో 80,200 రూపాయలకు చేరుకుంది.