Kejrival : ఢిల్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలంటూ రాజీనామా
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కు పంపారు
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కు పంపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన నిర్దోషిత్వం తేలేంత వరకూ ముఖ్యమంత్రిగా ఉండబోనని తెలిపారు. అందుకే ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ను కోరారు. తదుపరి ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఆతిశిని ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.
తదుపరి ముఖ్యమంత్రిగా...
తదుపరి ముఖ్యమంత్రిగా అతిశి చేత ప్రమాణం చేయించాలని కూడా కేజ్రీవాల్ కోరారు. అయితే త్వరలోనే శాసనసభను కూడా రద్దు చేసే యోచనలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటూ ఆయన నిర్ణయించారు. నవంబరు నెలలో మహారాష్ట్రతో పాటు ఢిల్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే కేజ్రీవాల్ ఎన్నికల సంఘాన్ని కోరిన సంగతి తెలిసిందే.