బ్యాడ్ లక్ .. బంగారం ధర ఎంతంటే?

ఈరోజు కూడా దేశంలో బంగారం ధర పెరిగింది. పది గ్రాముల బంగారంపై రూ.200లు పెరిగింది.

Update: 2022-12-29 04:03 GMT

బంగారం అంటే భారతీయులకు మక్కువ ఎక్కువ. భారత్ లోె అమ్ముడు పోయినట్లు బంగారం మరెక్కడా అమ్ముడు పోదంటారు. భారతీయ సంప్రదాయంలో భాగమైన బంగారాన్ని కొనుగోలు చేసే వారు ఎక్కువ. కొనుగోలు శక్తి ఎక్కువయ్యేకొద్దీ బంగారం ధరల పెరుగుదలతో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తున్నారు. దీంతో డిమాండ్ పెరిగింది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వెండి కూడా...
దేశంలో తాజాగా బంగారం ధర మూడు రోజుల నుంచి పెరుగుతుంది. ఈరోజు కూడా దేశంలో బంగారం ధర పెరిగింది. పది గ్రాముల బంగారంపై రూ.200లు పెరిగింది. వెండి ధర కూడా స్వల్పంగానే పెరిగింది. కిలో వెండి పై రూ.400లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,710 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,150 రూపాయలకు చేరుకుంది. ఇక కిలో వెండి ధర 74,600 రూపాయల వద్దకు చేరుకుంది.


Tags:    

Similar News