Bharath bandh : నేడు భారత్ బంద్
రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రైతు సంఘాలు నేడు భారత్ బంద్‌కు పిలుపు నిచ్చాయి
రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రైతు సంఘాలు నేడు భారత్ బంద్‌కు పిలుపు నిచ్చాయి. దేశ వ్యాప్తంగా నేడు బంద్ నిర్వహించాలని రైతు సంఘాలు ఇప్పటికే పిలుపు నివ్వడంతో ప్రధానంగా ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశముంది. గత నాలుగు రోజుల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు తమ డిమాండ్లను సాధించుకోవడం రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రభుత్వం జరిపిన చర్చలు...
రైతు సంఘం నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కాలేదు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ బంద్ జరగాలని నిర్వహించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ దేశ వ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు, కార్మికులు ఆందోళన నిర్వహించాలని కూడా నిర్ణయించాయి. దీంతో పంజాబ్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో పోలీసులు పెద్దయెత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు.