నేడు కేంద్ర బడ్జెట్... ఆశతో తెలుగు రాష్ట్రాలు

2021-2022 ఆర్థిక సంవత్సరానికి మరికాసేపట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు.

Update: 2022-02-01 01:48 GMT

2021-2022 ఆర్థిక సంవత్సరానికి మరికాసేపట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ కోసం దేశమొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అందే రాయితీలతో పాటు కొత్త పథకాలపై ఎన్నో ఆశలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా విభజన తర్వాత నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ఈసారి బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తమ గోడు వింటారని భావిస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాలు....
విభజన హమీలను అమలు చేయడంతో పాటు, పెండింగ్ ప్రాజెక్టులను ఈ ఏడాది అయినా అమలు చేయాలని రెండు తెలుగు రాష్ట్రాలు కోరుతున్నాయి. ఇక మధ్యతరగతి ఉద్యోగులు ఆదాయపు పన్ను పరిమితిని పెంచుతారన్న అంచనాలో ఉన్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రాధాన్యతలు ఎలా ఉంటాయన్నది మరికాసేపట్లో తెలియబోతుంది.


Tags:    

Similar News