నేడు యూపీలో తొలిదశ ఎన్నిక... పోలింగ్ ప్రారంభం
అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో నేడు తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు
అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో నేడు తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ ప్రారంభమయింది. తొలిదశ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లు కోవిడ్ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకున్నారు. భౌతిక దూరంతో పాటు శానిటైజర్లను కూడా పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేశారు. దీంతో పాటు పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
58 నియోజకవర్గాల్లో....
తొలి దశ ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 11 జిల్లాల్లో 58 నియోజకవర్గాల్లో ఈ ఎన్నిక జరగనుంది. తొలిదశ ఎన్నికల్లో 2.27 కోట్ల మంది ఓటర్లు పాల్గొననున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీతో పాటు అనేక ప్రాంతీయ పార్టీలు ఎన్నికల బరిలో తలపడుతున్నాయి. పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ జరుగుతుంది.