మగువలకు షాక్.. తగ్గనంటున్న బంగారం
బంగారం ధరలు ఎలా ఉన్నా కొనుగోళ్లు చేయక తప్పని పరిస్థితులు ఉంటాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్ల సీజన్లో తప్పనిసరిగా బంగారాన్ని..
బంగారాన్ని మెచ్చనివారు, ఇష్టపడని వారుండరు. బంగారం ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేసేవారు ఎక్కువ. బంగారం ధరలు ఎలా ఉన్నా కొనుగోళ్లు చేయక తప్పని పరిస్థితులు ఉంటాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్ల సీజన్లో తప్పనిసరిగా బంగారాన్ని కొనాల్సి ఉంటుంది. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుండటంతో.. బంగారం ధరలు మళ్లీ పైపైకి పెరిగిపోతున్నాయి. తగ్గనంటే తగ్గనంటోంది. వెండి ధరలు మాత్రం కాస్త తగ్గాయి.
10 గ్రాముల బంగారంపై రూ.100 మేర పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,040 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలున్నాయి. ఇక కిలో వెండిపై రూ.200 తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో కిలో వెండి ధర రూ. 80,200గా ఉంది.