గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర

ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రెండు వందల రూపాయలు తగ్గింది.

Update: 2022-08-23 02:08 GMT

బంగారం ధరలు గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. శ్రావణమాసం పూర్తికావస్తుండటంతో కొనుగోళ్లు కూడా మందగించాయని వ్యాపారులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కూడా మళ్లీ డీసెంబరు నాటికి ప్రారంభం కాదని చెబుతున్నారు. ఈ సమయంలో బంగారం కొనుగోళ్లు పెద్దగా ఉండవని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వల కారణంగా బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బంగారం ప్రతి భారతీయుడి ఇంట్లో ఒక ప్రధాన వస్తువుగా మారడంతో దానికి డిమాండ్ రోజురోజకూ పెరుగుతుంది. ప్రధానంగా మహిళలు ఇష్టపడే బంగారం విలువ రోజురోజుకూ పెరిగిపోతుంది.

వెండి ధరలు కూడా...
దేశంలో నిన్నటి వరకూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. కానీ ఈరోజు మాత్రం బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రెండు వందల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,930 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,600 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 61,100 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News