గుడ్ న్యూస్... తగ్గన బంగారం ధర
దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. స్వల్పంగా తగ్గినప్పటికీ బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం
బంగారం ధరల్లో మార్పులు సహజమే. ధరలు ఎప్పుడు పెరుగుతాయో? ఎప్పుడు తగ్గుతాయో? అంచనా వేయడం కష్టమే. అందుకే ధరల గురించి పెద్దగా పట్టించుకోకుండా కొనుగోలు చేయడం మామూలయిపోయింది. భారీగా ధరల పెరుగుదల, తగ్గుదల ఉండకపోవడంతో కొనుగోలుదారులు పెద్దగా కష్టం లేకుండా ఇష్టంగానే బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు బంగారం ధరల పై ప్రభావం చూపుతాయి. బంగారాన్ని కొనుగోలు చేయడం ఇప్పుడు పెట్టుబడిగా కూడా చేస్తుండటంతో ధరల విషయంలో పట్టింపులు లేవు. కాని మధ్యతరగతి ప్రజలకు మాత్రం బంగారం ఎప్పుడూ బంగారమే. అందుకే ధరలను తగ్గినప్పుడు వారు కొనుగోలు చేస్తారన్నది వ్యాపార వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు కూడా సూచిస్తున్నారు.
వెండి కూడా...
తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. స్వల్పంగా తగ్గినప్పటికీ బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,440 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,150 రూపాయలు ఉంది. ఇక కిలో వెండి ధరపై రూ.500ల వరకూ తగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర ప్రస్తుతం 63,000 రూపాయలు.