గుడ్ న్యూస్.. గోల్డ్ రేట్స్ ఇలా
దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.330లు, కిలో వెండి పై రూ.600ల వరకూ తగ్గింది.
బంగారం ధర గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతుంది. బంగారం ధరలు తగ్గుతున్నాయంటే ఎవరైనా ఆనంద పడక తప్పదు. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో ప్రతి ఇంట్లో బంగారం ఒక భాగమయిపోయింది. అయితే గత కొంతకాలంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం, ద్రవ్యోల్బణం తదితర అంశాలతో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. బంగారం కొనుగోళ్లు ఇటీవల కాలంలో మందగించాయని, ఆషాఢమాసం కావడంతో కొనుగోలు చేసేందుకు ఎవరూ ఇష్టపడటం లేదని వ్యాపారులు చెబుతున్నారు. రాబోయేది శ్రావణ మాసం కావడంతో కొనుగోళ్లు ఊపందుకుంటాయన్న ఆశాభావాన్ని వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు.
వెండి కూడా...
దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.330లు, కిలో వెండి పై రూ.600ల వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,400 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,200 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 60,700 రూపాయలుగా ఉంది.