మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం ధర
దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం పై రూ.250లు పెరిగింది
బంగారం ధరలను ఇప్పుడు ఎవరూ లెక్క చేయడం లేదు. తమవద్ద డబ్బులు ఉన్నప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా భారతీయ మహిళలు ఇష్పపడే బంగారం ధరలతో సంబంధం లేకుండా కొనుగోళ్లు జరుగుతుంటాయి. కేంద్రీయ బ్యాంకుల వద్ద నిల్వలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకుల కారణంగా బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక శ్రావణమాసం కావడం పెళ్లిళ్లు జరుగుతుండటంతో జ్యుయలరీ షాపులు కిటకటలాడుతున్నాయి. బంగారం కొనుగోళ్లతో కళకళ లాడుతున్నాయి.
వెండి కూడా....
తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం పై రూ.250లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,350 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,650 రూపాయలు ఉంది. వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో వెండి ధర 63,600 రూపాయలుగా ఉంది.