భగ భగ మండిన బంగారం
దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పెరిగిన ధరలను చూసి కొనుగోలుదారులు షాక్ అవ్వాల్సిందే
బంగారం ధర ఎప్పుడు పెరుగుతుందో చెప్పలేం. అందుకే తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని సూచిస్తారు నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు వంటి కారణంగా బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు ఉంటాయి. అయితే తగ్గినప్పుడు స్వల్పంగా, పెరిగినప్పుడు భారీగా ధరలు పెరగడం ఒక్క బంగారం విషయంలోనే సాధ్యమవుతుంది. పసిడి అంటే పడి చచ్చి పోయే భారతీయులు ఎంత ధర పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆపడం లేదు. దాని డిమాండ్ తగ్గడం లేదు అందుకే బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఈరోజు నుంచి శ్రావణ మాసం ఉండటం, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం ధరలు మరింత పెరిగాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
వెండి కూడా....
తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పెరిగిన ధరలను చూసి కొనుగోలుదారులు షాక్ అవ్వాల్సిందే. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,380 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,100 రూపాయలుగా ఉంది. వెండి ధర కూడా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 62,2000 రూపాయలుగా ఉంది.