బంగారం ధర అదిరింది

దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.500లు పెరిగింది. కిలో వెండి పై రూ.700లు పెరిగింది.

Update: 2023-01-04 03:17 GMT

బంగారం ధరలు ఎప్పుడూ నిలకడగా ఉండవు. ప్రతి రోజు మారుతూనే ఉంటాయి. కొద్ది రోజులు ధరలు తగ్గుతూ ఉంటే, ఎక్కువ రోజులు ధరలు పెరుగుతూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటివని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. ఒకరోజు తగ్గితే నాలుగు రోజులు పెరుగుతూ పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. అయితే బంగారం అనేది అవసరమైన వస్తువుగా మారడంతో కొనుగోళ్లు పెరుగుతున్నాయి. కానీ రాను రాను బంగారం అపురూపమైన వస్తువుగా మారనుంది. ధరలు నింగిని తాకుతున్నాయి. కొత్త ఏడాదిలో తులం బంగారం అరవై వేలు దాటే అవకాశం లేకపోలేదు. అయినా డిమాండ్ ను బట్టి కొనుగోలు చేస్తారని వ్యాపారులు భావిస్తున్నారు. ధరలతో సంబంధం లేకుండా కొనుగోళ్లు జరగడం వల్లనే బంగారం ధరలు తగ్గడం లేదనే వారు అనేకమంది ఉన్నారు.

వెండి కూడా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.500లు పెరిగింది. కిలో వెండి పై రూ.700లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,950 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,580 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 75,500 రూపాయలకు చేరుకోవడం విశేషం.


Tags:    

Similar News