60వేలు దాటిన బంగారం ధర

దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారంపై 600లు పెరిగింది. కిలో వెండిపై రూ.600లు పెరిగింది

Update: 2023-04-05 02:50 GMT

బంగారాన్ని స్టేటస్ సింబల్‌గా చూస్తుండటంతోనే కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. బంగారం ఎంత ఎక్కువగా ఉంటే అంత గౌరవం సమాజంలో లభిస్తుందన్న కారణంతో బంగారాన్ని ఇష్టపడి.. కష్టపడి కొనుగోలు చేస్తున్నారు. దీంతో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు బంగారం భారంగా మారింది. పెరుగుతున్న ధరలతో బంగారాన్ని సొంతం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులను తగ్గించడం కారణంగానూ ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. పెళ్లిళ్ల సమయంలో బంగారం వస్తువులు పెట్టడం సంప్రదాయంగా వస్తుండటంతో కొనుగోళ్లు కూడా ఎక్కువగా ఉంటాయి.

వెండి కూడా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారంపై 600లు పెరిగింది. కిలో వెండిపై రూ.600లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,300 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,330 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర 77,800 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News