ధన్‌తెరాస్.. ధరలు పెరుగుతున్నాయ్

ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. గ్రాముకు స్వల్పంగా పెరిగినా అది పది గ్రాములకు వచ్చేసరికి ఎక్కువ మొత్తమే అవుతుంది

Update: 2022-10-18 02:11 GMT

బంగారం ధరలు అంతే. డిమాండ్ ను బట్టే ధరలు పెరుగుతుంటాయి. పసిడి ప్రియులు కూడా ఇష్టపడే బంగారంపై ప్రభుత్వాలు అనేక రకాలుగా భారం మోపుతుండటం కూడా కారణం. జీఎస్టీ అంటూ కొంత వడ్డిస్తుండటంతో పసిడి ధర ఆకాశాన్నంటుంతుంది. అయినా మహిళలు లెక్క చేయరు. వచ్చినంత మేరకు బంగారాన్ని కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. బంగారం కష్టకాలంలో ఉపయోగపడుతుందన్న ఏకైక కారణమే దానిని కొనుగోళ్లు పెరిగాయని చెప్పవచ్చు. ధరలను, పన్నులను పట్టించుకోవడం లేదు. అందుకే బంగారం విలువ తగ్గదు. వన్నె తగ్గదు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలు ధరల పెరుగుదలకు మార్కెట్ నిపుణులు కారణంగా చెబుతుంటారు. దీపావళికి బంగారం మరింత పెరుగుతుందని ముందు నుంచే మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా ధన్ తేరాస్ రోజు కొనుగోలు చేయాలన్న లక్ష్యంతో వేచి చూసే వారు కొందరయితే ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకునే వారు మరికొందరు. ఇలా భారత్ లో ఎప్పుటికీ బంగారానికి డిమాండ్ పడిపోదు.

హైదరాబాద్ లో...
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. గ్రాముకు స్వల్పంగా పెరిగినా అది పది గ్రాములకు వచ్చేసరికి ఎక్కువ మొత్తమే అవుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,680 రూపాయల వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,460 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర 60,500 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News