బంగారం ఇక కొందరి వస్తువేనా?

దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.150లు పెరిగింది

Update: 2022-12-11 01:53 GMT

బంగారం ధరలు ఎక్స్‌ప్రెస్ రైలు కంటే వేగంగా పరుగులు తీస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు అమాంతం పెరిగాయి. బంగారం, వెండి కొనుగోలు చేయాలంటే సామాన్యులకు సాధ్యం కావడం లేదు. రెండూ పేదలకు అపురూపంగా మారిపోయాయి. గౌరవమైన వస్తువుగా భావించాల్సిన రోజులు ఎప్పుడో వచ్చేసినా.. మొన్నటి వరకూ మధ్యతరగతి వారికైనా కొంత అందుబాటులో ఉండేవి. రాను రాను బంగారం ధనికుల ఇళ్లల్లో వస్తువుగానే తయారయ్యే అవకాశాలు లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. కొనుగోలు శక్తి పెరిగినా దానికి నాలుగు వంతుల ధరలు పెరుగుతుండటంతో బంగారం కొందరి వస్తువుగా మారనుందడానికి అనేక కారణాలున్నాయి. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంట ి కారణాలు బంగారం ధరలు పెరగడానికి కారణాలుగా నిపుణులు చెబుతున్న మాట.

భారీగా పెరిగిన ధరలు...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.150లు పెరిగింది. వెండి కూడా తానేమీ తగ్గేదేలే అంటూ చుక్కలు చూపుతుంది. కిలో వెండ ధర పై రూ. 500లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,440 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,900 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 73,000 రూపాయలకు చేరుకోవడం విశేషం.


Tags:    

Similar News