షాకింగ్.. పెరిగిన బంగారం ధరలు

ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.110ల వరకూ పెరిగింది.

Update: 2022-09-06 02:29 GMT

బంగారం అంటే అంతే మరి. ధరలు ఎప్పుడు పెరుగుతాయో? ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం. దిగివచ్చినప్పుడే బంగారాన్ని కొనుగోలు చేయాలి. బంగారం ధరలు తగ్గేది తక్కువ సార్లు. పెరిగేది ఎక్కువ సార్లుగా ఉంటుంది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం బంగారం ధరల్లో మార్పులు చేర్పులకు కారణంగా మారుతుంటాయి. అందుకే తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు కూడా చెబుతుంటారు. భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కష్టపడి కొనుగోలు చేస్తారు. కొందరు పెట్టుబడిగా కూడా కొనుగోలు చేస్తుంటారు. అయితే గత కొద్దిరోజులుగా తగ్గుతున్న బంగారం ధరలతో కొనుగోళ్లు కూడా పెరిగాయంటున్నారు వ్యాపారులు.

ధరలు....
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.110ల వరకూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలాఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,000 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,750 రూపాయలు ఉంది. ఇక కిలో వెండి హైదరాబాద్ లో 58,000 రూపాయలు ఉంది.


Tags:    

Similar News