షాకింగ్ : పెరిగిన బంగారం ధరలు
ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.160ల వరకూ పెరిగింది. వెండి కిలో పై రూ.800 లు పెరిగింది
బంగారం ధరలు ఎప్పుడూ ఒకలా ఉండవు. ఒకసారి పెరిగితే.. మరొకసారి తగ్గుతాయి. అయితే భారీగా అప్పుడప్పుడూ మాత్రమే ధరలు తగ్గుతుంటాయి. ఎక్కువ సార్లు భారీగా ధరలు పెరిగితే, స్వల్పంగానే ధరలు తగ్గుతాయి. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండటంతో బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయని నిపుణుల హెచ్చరికలు ఒక వైపు ఉండగా నేడు స్వల్పంగా బంగారం ధరలు పెరిగాయి. పసిడి అంటే ప్రాణం ఇచ్చే వాళ్లు భారతీయ మహిళలు, అందుకోసం వారు ధరలను కూడా లెక్క చేయరు. అదే వ్యాపారులకు అడ్వాంటేజీగా మారింది. రకారకాల డిజైన్లతో మహిళలను ఆకట్టుకుంటూ తమ వ్యాపారాలను పెంచుకోవడం పరిపాటిగా మారింది కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు.