బంగారం ధరలకు బ్రేక్.. స్వల్పంగా పెరిగిన వెండి

ఎన్నడులేనంతగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ భారీగా పెరుగుతున్న బంగారం

Update: 2023-02-09 04:15 GMT

feb 9th gold price

బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ హెచ్చుతగ్గులు సహజం. బులియన్ మార్కెట్ లో గతంలో ఎన్నడులేనంతగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు తాజాగా బ్రేక్ పడింది. బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధర స్వల్పంగా పెరిగింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,550గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. వెండి విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.74,100కి చేరింది. బంగారం ధర స్థిరంగా ఉండటంతో.. పసిడి ప్రియుడు బంగారం కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు.


Tags:    

Similar News