పుత్తడి మరింత దిగొచ్చిందోచ్
దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇది మహిళలకు కొంత ఊరల కలిగించే అంశమే.
పుత్తడి అంటే ఎవరికి ప్రియం కాదు. అందరూ దానిని ఇష్టపడతారు. దాని ధర చూసే వెనక్కు తగ్గుతారు. పసిడి అంటేనే భారత్ లో ప్రతి ఇంట్లో ఒక ప్రియమైన వస్తువుగా చూస్తారు. బంగారం ఒక గౌరవాన్ని ఇచ్చేది గా చూస్తారు. హుందాతనాన్ని ఇచ్చేదిగా భావిస్తారు. అలాంటి పసిడి ధర గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు కనిపిస్తుంది. వరసగా రెండు రోజుల నుంచి బంగారం ధర తగ్గుతూ వస్తుంది. తగ్గుదల పెద్దగా కాకపోయినా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసిన వారికి శుభవార్తేనని చెప్పాలి. బంగారాన్ని పెట్టుబడిగా భావించే వారు కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్ లో బంగారం ధర మరింత పెరిగే అవకాశముందని కూడా వారంటున్నారు.
ధరలు ఇలా....
తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇది మహిళలకు కొంత ఊరల కలిగించే అంశమే. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,390 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,190 రూపాయలు ఉంది. వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పు కన్పిస్తుంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 60,700 రూపాయలుగా ఉంది.