స్థిరంగా బంగారం ధరలు

దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి

Update: 2022-07-19 02:23 GMT

gold, silver, hyderabad

పుత్తడి అంటేనే అందరికీ ప్రీతి. ఎంతోకొంత బంగారాన్ని కొనుగోలు చేయాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. భారతదేశంలో ప్రతి ఇంట్లో బంగారం అన్నది ఒక వస్తువుగా మారిపోయింది. సంప్రదాయాలు, సంస్కృతికి బంగారాన్ని చిహ్నంగా చూస్తున్నారు. తాతల కాలం నాటి నుంచి బంగారం ఎంత ఉంటే అంత మంచిదన్న ధోరణి వ్యక్తమవుతుంది. కష్టకాలంలో బంగారం ఆదుకుంటుందని మరికొందరు నమ్ముతారు. అందుకే పెట్టుబడిగా కూడా బంగారం మారింది. అలాంటి పరిస్థితుల్లో భారత్ లో బంగారానికి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. సీజన్లతో సంబంధం లేకుండా కొనుగోలు చేసేది బంగారాన్నే. ఇంట్లో శుభకార్యక్రమాలకు బంగారం వాడకం ఎప్పటి నుంచో వస్తుంది. అందుకే జ్యుయలరీ షాపులు నిత్యం కిటకిటలాడుతుంటాయి. రానున్నది శ్రావణ మాసం కావడంతో బంగారం కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశముంది.

వెండి కూడా....
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,390 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,190 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 61,700 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News