గుడ్ న్యూస్... ఈరోజు బంగారం ధరలు?
దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి వీటి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి
అవును.. ఈరోజు బంగారం ధరలు పెరగలేదు. బంగారం ధరలు పెరుగుతాయని చాలా మంది కలవరపడుతుంటారు. అనేక మంది డోన్ట్ కేర్ అంటారు. కొందరు ధరలు తగ్గితే బాగుండు అని భావిస్తుండగా, ధరలు పెరగకపోతే కొనుగోలు చేద్దామని వెయిట్ చేసేవారు మరికొందరు. కానీ ధరలు పెరిగినా, తగ్గినా తమకు ఇష్టమైన బంగారం ఆభరణాలను కొనుగోలు చేసేందుకు వెనుకాడరు. చివరి వారే ఇటీవల కాలంలో ఎక్కువగా కనపడుతున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగరాం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతుంటాయి. తగ్గుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు.
వెండి కూడా...
దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి వీటి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,200 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,850 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ లో 66,000 రూపాయలుగా ఉంది.