బంగారం కొనాలంటే.. ఈరోజు..?
దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇది పసిిడి ప్రియులకు ఒకరకంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి.
బంగారం అంటే అంతే మరి. పెరిగితే భారీగా.. తగ్గితే తక్కువగా నమోదవుతుండటం అందరం చూస్తున్నదే. ప్రధానంగా కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం ధరలు మరింత పెరిగాయి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు పెరుగుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. భారత్ కూడా బంగారం దిగుమతులను తగ్గించింది. రూపాయి మరింత బలపడటం కోసం బంగారం దిగుమతిపై కొంత కంట్రోల్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు పెరుగుతున్నాయి.
స్థిరంగా ధరలు...
దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇది పసిిడి ప్రియులకు ఒకరకంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,400 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,160 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర 74,200 రూపాయలుగా నమోదయింది.