గుడ్ న్యూస్ ... స్థిరంగా బంగారం ధరలు

దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండు రోజుల నుంచి ఇదే పరిస్థితి

Update: 2022-08-16 01:28 GMT

బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. బంగారం ధరల్లో మార్పు అనేక కారణాలపై ఆధారపడి ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడకులు వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. పసిడి అంటే మగువలకు అత్యంత ఇష్టం కావడంతో వారి కొనుగోళ్లు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. పేద, మధ్య, ఉన్నత వర్గాల తేడా లేకుండా బంగారం కొనుగోలుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. భారతీయ సంస్కృతిలో బంగారం ఒక భాగమయిపోవడంతో దాని విలువ మరింత పెరిగింది. అందుకే బంగారానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు.

ధరలు ఇలా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండు రోజుల నుంచి ఇదే పరిస్థితి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,530 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,150 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర 64.800 రూపాయలు పలుకుతుంది.


Tags:    

Similar News