బ్యాడ్ న్యూస్.. రెండో రోజూ పెరిగిన బంగారం ధర

దేశంలో రెండో రోజు కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.270 లు పెరిగింది.

Update: 2022-08-26 02:08 GMT

బంగారం కొనుగోలు చేయడం అంటే అంత ఈజీ కాదు. అందునా మహిళలు అంత తేలిగ్గా బంగారాన్ని కొనుగోలు చేయరు. ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. ఆభరణాల్లో కొత్త మోడల్స్ తో ఆకట్టుకుంటాయి. ప్రతి భారతీయ మహిళ కొత్త మోడల్ బంగారు ఆభరణాన్ని కొనుగోలు చేయాలని పరితపిస్తుంటుంది. అప్పుడే సమాజంలో మనకు గౌరవం లభిస్తుందన్న భావన బలంగా పేరుకుపోయింది. అందుకే భారత్ లో బంగారానికి డిమాండ్ ఎక్కువ. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం కారణంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేేసుకుంటాయి. ఎంత ధర పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. గతంలో బంగారానికి ఒక సీజన్ అంటూ ఉండేది. ఈ మధ్య కాలంలో ఆ సీజన్ లేకుండా పోయింది. ఎప్పుడు డబ్బులుంటే అప్పుడే కొనుగోలు చేయడం అలవాటుగా మారింది.

ధరలు ఇలా....
తాజాగా దేశంలో రెండో రోజు కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.270 లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,820 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,500 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర 61,100 రూపాయలు పలుకుతుంది.


Tags:    

Similar News