Today Gold Prices : స్థిరంగా బంగారం.. పెరిగిన వెండి

అంతో ఇంతే కూడబెట్టుకుని బంగారం కొనాలని ఆలోచించేవారు.. కొద్దిరోజులు ఆగితే మంచిదేమో. బుధవారం 10 గ్రాముల..

Update: 2022-12-09 02:29 GMT

పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధరలు పెరగడం మామూలే. గత నెల ఆరంభంలో 52 వేలు ఉన్న బంగారం ధర.. డిసెంబర్ కి వచ్చేసరికి రూ.54,000కి చేరింది. ఇక తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేసేవారికి తప్ప.. అంతో ఇంతే కూడబెట్టుకుని బంగారం కొనాలని ఆలోచించేవారు.. కొద్దిరోజులు ఆగితే మంచిదేమో. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.300 తగ్గగా.. గురువారం రూ.200 పెరిగింది. ఇక ఈరోజు కూడా గురువారం నాటి బంగారం ధరలే కొనసాగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,000 వద్ద స్థిరంగా ఉంది. బంగారం స్థిరంగా ఉన్న వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధరపై రూ.300 పెరిగి..71,300కు చేరువైంది. ఢిల్లీ, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.66,200గా ఉంది.


Tags:    

Similar News