భారీగా పెరిగాయ్

దేశంలో ఈరోజు బంగారం. వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.300లు పెరిగింది

Update: 2023-04-01 05:34 GMT

బంగారం ధరలు వరసగా కొనుగోలు దారులకు షాక్ ఇస్తున్నాయి. బంగారం ధరలు పెరుగుతున్నప్పుడల్లా కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేయడం, తర్వాత కొనుగోలు చేయడం మామూలుగా మారిపోయింది. బంగారాన్ని కొందరు పెట్టుబడిగా చూస్తున్నారు. 2000 సంవత్సరంలో పది గ్రాముల బంగారం కేవలం 4,400 రూపాయలు మాత్రమే ఉండేది. కానీ నేడు అది అరవై వేల రూపాయలకు చేరుకుంది. అయితే ఇరవై ఏళ్లలో బంగారంలో లభించిన ఆ పెరుగుదల మరో ఇరవై ఏళ్లకు లభించే అవకాశం లేదన్నది మార్కెట్ నిపుణుల అంచనా. అయితే పెళ్లిళ్లు, శుభకార్యాలయాలకు దక్షిణాదిన బంగారం కొనుగోలు చేసే సెంటిమెంట్ ఉండటంతో కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. బంగారం ధరల పెరుగుదలతో సంబంధం లేకుండా సీజన్‌తో పని లేకుండా కొనుగోళ్లు ఉంటున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

వెండి కూడా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం. వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.300లు పెరిగింది. కిలో వెండి ధరపై రూ.700లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,000 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,000 రూపాయలకు చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర 77,700 రూపాయలు పలుకుతుంది.


Tags:    

Similar News